: ఆ జైల్లో భారతీయ ఖైదీల పరిస్థితి పశువుల కంటే హీనం!
పాకిస్తాన్ జైళ్ళలో శిక్ష అనుభవిస్తోన్న భారతీయ ఖైదీల పరిస్థితి పశువుల కంటే హీనమని స్వర్ణలాల్ అనే భారతీయుడు తెలిపాడు. ముఖ్యంగా లాహోర్ లోని కోట్ లఖ్ పత్ జైల్లో అయితే మరింత దారుణంగా వ్యవహరిస్తారని లాల్ పేర్కొన్నారు. లాల్ కొంతకాలం లాహోర్ కారాగారంలో శిక్ష అనుభవించి ఇటీవలే బయటికి వచ్చాడు. సరబ్ జిత్ పై తోటి ఖైదీల దాడి నేపథ్యంలో లాల్ మీడియాతో తన అనుభవాలు పంచుకున్నాడు. ఆ జైల్లో భారతీయ ఖైదీలను జంతువుల్లా పరిగణిస్తారని చెప్పాడు. దయాదాక్షిణ్యాలు లేకుండా అకారణంగా హింసిస్తారన్నాడు. మన దేశ ఖైదీలను చిన్నవైన ఇరుకు గదుల్లో బంధించడమే కాకుండా, అప్పుడప్పుడు తలకిందులుగా వేలాడదీస్తారని వివరించాడు.