: ఒక్కటో తారీఖు భయం వద్దు... జీతాల చెల్లింపులకు ఇబ్బంది లేదు: స‌్పష్టం చేసిన అరుణ్‌జైట్లీ
నగదు కొరత నేపథ్యంలో రేపు ఒకటో తారీఖు కానుండడంతో తమకు అందాల్సిన జీతాలు అందుతాయా? లేదా? అంటూ ఉద్యోగులు వ్యక్తం చేస్తోన్న ఆందోళన పట్ల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ స్పందించారు. ఉద్యోగుల వేతనాల చెల్లింపులకు ఎటువంటి ఇబ్బందీ లేదని స్పష్టం చేశారు. ఒకటో తారీఖు నేపథ్యంలో ప్రజలకి అవసరమైన మేరకు డబ్బుని అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ప్రజలు నగదు కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. మరోవైపు 500 రూపాయల నోట్ల ముద్రణ వేగవంతం చేశామని అన్నారు. రూ.2 వేల నోట్ల ముద్రణ కూడా కొనసాగుతోందని చెప్పారు.