: అమితాబ్ తో కలసి స్టెప్పులేసిన 'మహా' ముఖ్యమంత్రి భార్య


బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో కలసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృత ఫడ్నవిస్ స్టెప్పులేశారు. ఓ ముఖ్యమంత్రికి భార్య అయ్యుండి కూడా... ఇప్పటికీ ఓ బ్యాంకులో ఆమె ఉద్యోగం చేస్తున్నారు. అంతేకాదు, బాలీవుడ్ సినిమాల్లో అడపా, దడపా పాటలు కూడా పాడుతుంటారు. జై గంగాజల్, ఫిర్ సే లాంటి సినిమాల్లో ఆమె సూపర్ హిట్ సాంగ్స్ పాడారు. ఇప్పుడు ఏకంగా తెరపై మెరవడానికి ఆమె సిద్ధమయ్యారు. ప్రముఖ మ్యూజిక్ సంస్థ టీసిరీస్ ప్రతి ఏడాది బిగ్ బడ్జెట్ మ్యూజిక్ వీడియోస్ ను రూపొందిస్తుంటుంది. ఈ వీడియోల్లో బాలీవుడ్ స్టార్లను కూడా నటింపజేస్తుంది. ఇప్పుడు 'ఫిర్ సే' పేరుతో మ్యూజిక్ వీడియోను రూపొందిస్తోంది. ఇందులో భాగంగానే అమితాబ్ తో కలసి చిందులేశారు అమృత ఫడ్నవిస్.

  • Loading...

More Telugu News