: మల్కన్‌గిరి ఎస్పీ ఎదుట లొంగిపోయిన 113 మంది మావోయిస్టు సానుభూతిపరులు


ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు పెద్ద ఎత్తున స్వ‌చ్ఛందంగా పోలీసుల‌కు లొంగిపోతున్నారు. ఆంధ్ర‌-ఒడిశా స‌రిహ‌ద్దులో జ‌రిగిన భారీ ఎన్ కౌంట‌ర్ త‌రువాత పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ రోజు 113 మంది మావోయిస్టు సానుభూతిపరులు మల్కన్‌గిరి ఎస్పీ ఎదుట లొంగిపోయారు. కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల పెద్దనోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణ‌యంతో మావోయిస్టులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నార‌ని, ఈ క్ర‌మంలోనే త‌మ ఎదుట స్వ‌చ్ఛందంగా లొంగిపోతున్నారని పోలీసులు మీడియాకు తెలిపారు.

  • Loading...

More Telugu News