: ఏపీ సీఎస్ పదవీ కాలం మరోమారు పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ పదవీ కాలాన్ని మరో మూడు నెలల పాటు పొడిగించారు. ఈ మేరకు ఈరోజు మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వుల ప్రకారం, వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరు వరకు ఆయన పదవిలో కొనసాగుతారు. కాగా, టక్కర్ ను సీఎస్ గా మరో ఆరు నెలలపాటు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు, ఈ మేరకు కేంద్రానికి గతంలో ఒక లేఖ రాశారు. తొలుత మూడు నెలలపాటు ఆయన పదవీకాలాన్ని పొడిగించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. తాజాగా, మరో మూడు నెలల పాటు టక్కర్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.