: చిత్తూరులో రూ.70 లక్షల విలువైన పాతనోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు


పెద్ద‌నోట్ల ర‌ద్దు త‌రువాత తమ వద్ద ఉన్న పాత‌నోట్ల‌ను మార్చుకునేందుకు న‌ల్ల‌కుబేరులు ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌డంతో పోలీసులు వారిని నియంత్రించ‌డానికి విస్తృతంగా సోదాలు నిర్వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే చిత్తూరు జిల్లా వీజీపురం మండలం మిట్టూరులో ఈ రోజు పోలీసులు పెద్దఎత్తున పాతనోట్లను స్వాధీనం చేసుకున్నారు. త‌మ సోదాల్లో భాగంగా ఆ ప్రాంతంలో అనుమానం వ‌చ్చిన‌ ఇద్దరు వ్యక్తులను విచారించిన పోలీసులు వారి వద్ద రూ.70 లక్షలు ఉన్న‌ట్లు గుర్తించారు. ఆ న‌గ‌దుని స్వాధీనం చేసుకొని, స‌ద‌రు వ్య‌క్తుల‌ను విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News