: 'నాకు కిటుకులు చెప్పవా?' అంటూ కోహ్లీని కలిసిన ఇంగ్లండ్ ఆటగాడు


యువతరం స్టైల్ మారింది. గతంలో క్రికెటర్లు ప్రత్యర్థి జట్టును ప్రత్యర్థులుగానే భావించేవారు. వారి హావభావాల్లో ఆ విషయం తెలిసిపోయేది. ఐపీఎల్ అరంగేట్రంతో పరిస్థితి మారిపోయింది. వివిధ జట్లకు చెందిన క్రికెటర్లు ఒకే జట్టుగా ఆడడం కలిసి వచ్చింది. దీంతో తమ లోపాలను సరిదిద్దుకుని, కొత్త మెళకువలు తెలుసుకునే వెసులుబాటు కలిగింది. ఈ నేపథ్యంలో భారత పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ జట్టు వర్ధమాన ఆటగాడు హసీబ్ హమీద్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని కలిశాడు. తన బ్యాటింగ్ శైలిని మరింత మెరుగ్గా ఎలా మలచుకోవాలో చెప్పాలంటూ కోహ్లీని అడిగాడు. దీంతో కోహ్లీ పలు సూచనలు చేశాడు. కోహ్లీ చెబుతున్నంతసేపూ హమీద్ క్రమశిక్షణ కలిగిన విద్యార్థిలా శ్రద్ధగా విన్నాడు. వీరిద్దరి మధ్య సంభాషణ సందర్భంగా తీసిన ఫోటోను బీసీసీఐ 'తరం మారింది, అంతరాలు కూడా మారాయి' అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇది క్రీడాభిమానులను అలరిస్తోంది.

  • Loading...

More Telugu News