: హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సోనియాగాంధీ


ఢిల్లీలోని సర్ గంగారాం హాస్పిటల్ నుంచి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ డిశ్చార్జ్ అయ్యారు. వైరల్ ఫీవర్ తో బాధ పడుతున్న ఆమెను సోమవారం రాత్రి హాస్పిటల్ కి తరలించారు. ఛాతీ, ఊపిరితిత్తుల విభాగాలకు చెందిన వైద్యులు ఆమెకు చికిత్స చేశారు. గతంలో కేన్సర్ బారిన పడ్డ ఆమె అమెరికాలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. అయితే, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సోనియాగాంధీ... ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలకు హాజరవుతారా? లేక ఇంటి వద్ద కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకుంటారా? అనే విషయం తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News