: రెండు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ... ఏపీ విషయంలో కొనసాగుతున్న సస్పెన్స్
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కొత్తగా రెండు రాష్ట్రాలకు అధ్యక్షుల పేర్లను ప్రకటించింది. బీహార్ రాష్ట్ర అధ్యక్షుడిగా నిత్యానందరాయ్, ఢిల్లీ అధ్యక్షుడిగా మనోజ్ తివారీని ఎంపిక చేసినట్టు ఓ ప్రకటనలో బీజేపీ తెలిపింది. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలన్న దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఏపీ అధ్యక్షుడి నియామకానికి సంబంధించి ఇంకా చర్చలు కొనసాగుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కంభంపాటి హరిబాబునే ఆ పదవిలో కొనసాగిస్తారా? లేక కొత్త వ్యక్తికి అవకాశం కల్పిస్తారా? అనే విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.