: ట్విట్టర్‌లో మరో రెండు అదరగొట్టే కొత్త ఫీచర్‌లు
ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూజర్ల ముందుకు వస్తూ ఆకట్టుకుంటున్న సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ తాజాగా మరో రెండు కొత్త ఫీచర్‌లతో నెటిజన్ల ముందుకు వచ్చింది. ఈ ఫీచర్ల ద్వారా ట్విట్టర్ మొబైల్ యాప్‌లో ప్రముఖ సంభాషణలను కనుగొనవచ్చు. తమ యూజర్ల ముందుకు ట్విట్టర్ మొబైల్ యాప్‌లో ‘రిప్లై కౌంటర్’, ‘కన్వర్సేషనల్ ర్యాంకింగ్’ అనే ఫీచర్‌లను తీసుకొచ్చినట్లు సదరు సంస్థ పేర్కొంది. ఈ ఫీచర్ల కారణంగా ట్విట్టర్‌లో యూజర్లు పొందిన రిప్లైలు ఇకపై క్రొనోలాజికల్ ఆర్డర్‌లో కాకుండా వేరే విధంగా కనిపిస్తాయి. ట్విట్టర్‌లోని వేరే ఫీచర్లను యూజర్లు ఇంతకు ముందు లాగే ఉపయోగించుకోవచ్చు. ఈ తాజా ఫీచర్‌లతో యూజర్‌కి ముఖ్యమైన సంభాషణలు పై వరుసలో కనిపిస్తాయి. ట్విట్టర్ ఖాతా కలిగిన వ్యక్తి చేసిన ట్వీట్‌కు ఎంతమంది యూజర్లు నేరుగా రిప్లై ఇచ్చారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.