: సరిహద్దు ప్రాంతాల్లో 24 గంటలూ నిఘా: బీఎస్ఎఫ్ డీజీ ప్రకటన
దేశ సరిహద్దు ప్రాంతాల నుంచి ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకునేందుకు తీసుకుంటున్న చర్యలపై బీఎస్ఎఫ్ డీజీ కేకే శర్మ ఈ రోజు మీడియాకు వివరించారు. సరిహద్దుల్లో 24 గంటలూ నిఘా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ రోజు జమ్ముకశ్మీర్‌లోని చెమ్లియాల్, సాంబా ప్రాంతాల్లో ముగ్గురు ఉగ్రవాదులు చొరబాటుకి యత్నించారని వారి ప్రవేశాన్ని సమర్థవంతంగా అడ్డుకున్నామని చెప్పారు. సరిహద్దు ప్రాంతాల్లో సాంకేతికత వినియోగం పెరుగుతోందని చెప్పారు. సరిహద్దు ప్రాంతాల్లో కంచెల ఆధునికీకరణకు విస్తృత చర్యలు తీసుకుంటున్నామని, ఉగ్రవాదుల చొరబాట్లను, దాడులను తిప్పికొడుతున్నామని చెప్పారు. యోగా, ప్రాణాయామాలతో భారత భద్రతా సిబ్బంది ఉపశమనం పొందుతూ ఉత్సాహంగా పనిచేస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు.