: పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి ఎందుకొచ్చాడో చెప్పిన నాగబాబు


సినిమాలతో ఎంతో బిజీగా ఉంటూ, కోట్ల రూపాయలు సంపాదిస్తున్న పవన్ కల్యాణ్ జనసేన పార్టీని ఎందుకు స్థాపించారన్న ప్రశ్నకు అతని సోదరుడు నాగబాబు సమాధానమిచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన తమ్ముడు పవన్ పై ప్రశంసలు కురిపించారు. గొప్ప భావజాలం, మానవత్వం, గొప్ప గుణం పవన్ కు ఉన్న లక్షణాలని చెప్పారు. సాధారణంగా, ఏమీ చేయలేమనే నిరాశతో అనేక అంశాలను మనం వదిలేస్తుంటామని... కానీ, పవన్ కల్యాణ్ అలా కాదని... దేన్నీ అంత సాధారణంగా వదలడని చెప్పారు. రాజకీయాల్లోకి రావాలని ఫ్యాన్స్ కోరినందుకో, అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ లేకపోవడం వల్లో జనసేనను పవన్ స్థాపించలేదని తెలిపారు. ప్రజలకు అండగా నిలబడాలనే పవన్ రాజకీయాల్లోకి వచ్చాడని చెప్పారు. ఎవరైనా బాధ పడితే పవన్ తట్టుకోలేడని... ఎంతో నిరాశతోనే ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టాడని తెలిపారు. పవన్ కల్యాణ్ ఆర్థిక స్థితిపై నాగబాబు మాట్లాడుతూ, పవన్ ఇంతకు ముందు చెప్పినట్టే, అతని ఆర్థిక పరిస్థితి అంత మెరుగ్గా లేదని చెప్పారు. తన వల్ల కూడా తమ్ముడు కొంచెం డబ్బు నష్టపోయాడని తెలిపారు. అయితే, డబ్బుకు పవన్ ప్రాధాన్యత ఇవ్వడని... ఆర్థిక సమస్యలను లెక్క చేయడని చెప్పారు. మరో నాలుగు లేదా ఐదు సినిమాలు చేస్తే, ఆర్థికంగా సెటిల్ అవుతాడని... అప్పుడు రాజకీయాల్లో మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తాడని తెలిపారు.

  • Loading...

More Telugu News