: ఉభయసభలు ప్రారంభం.. లోక్ సభకు హాజరైన మోదీ.. సరిహద్దు వద్ద భద్రతపై చర్చించాలని విపక్షాల పట్టు
పార్లమెంటు ఉభయసభలు ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ లోక్ సభకు హాజరయ్యారు. అయితే, నిన్నటి వరకు పెద్దనోట్ల రద్దు అంశంపైనే చర్చకు పట్టుబట్టిన విపక్షాలు ఈ రోజు సరిహద్దు వద్ద భద్రత అంశంపై చర్చించాలని పట్టుపడుతున్నాయి. నగ్రొటాలో సైనికులపై దాడి ఘటనపై చర్చించాలని కోరుతున్నాయి. రాజ్యసభలో ఇదే అంశంపై విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. విపక్షాలు నగ్రొటాపైనే చర్చించాలనుకుంటే తాము ఆ అంశంపైనే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర అర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. మరోవైపు లోక్‌సభలో విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంలో సభను ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.