: ట్రంప్ టీంలో మరో భారతీయ మహిళ.. వైద్యురాలు సీమా వర్మకు ఉన్నత పదవి
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన టీంలోకి వరుసపెట్టి భారతీయులను తీసుకుంటున్నారు. తన బృందంలో మరో భారతీయ అమెరికన్ మహిళకు చోటు కల్పించారు. ఇప్పటికే నిక్కీ హేలీని 'ఐరాస'కు అమెరికా రాయబారిగా నామినేట్ చేసిన ట్రంప్ తాజాగా భారతీయ అమెరికన్ వైద్యురాలు సీమా వర్మకు ఉన్నత పదవి ఇచ్చారు. అమెరికా హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో సెంటర్ ఫర్ మెడికేర్ అండ్ మెడికైడ్ సర్వీసెస్‌కు సీమావర్మను ఇన్‌చార్జిగా నామినేట్ చేశారు. సీమ ప్రస్తుతం ఎస్‌వీసీ అనే జాతీయ ఆరోగ్య విధానం సలహా సంస్థకు సీఈవోగా వ్యవహరిస్తున్నారు. దీనిని సీమానే స్థాపించారు.