: జన్ ధన్ ఖాతాల్లో నగదు తీయాలంటే కఠిన ఆంక్షల అడ్డు... ఆర్బీఐ తాజా నిర్ణయం
పేదలను బ్యాంకింగ్ సౌకర్యానికి దగ్గర చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం చొరవ తీసుకుని మొదలు పెట్టిన జన్ ధన్, రూపే కార్డుల్లో అక్రమార్కులు భారీ ఎత్తున నల్లధనాన్ని డిపాజిట్ చేసినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఈ ఖాతాల నుంచి నగదు విత్ డ్రాలపై ఆర్బీఐ కఠిన ఆంక్షలు విధించింది. నగదు ఉపసంహరణ నిబంధనలను విడుదల చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేస్తూ, జన్ ధన్ ఖాతాదారులందూ కేవైసీ (నో యువర్ కస్టమర్) పత్రాలు ఇవ్వాలని, స్పష్టం చేసింది. కేవైసీ పత్రాలను బ్యాంకుకు సమర్పించిన వారు నెలకు రూ. 10 వేల వరకూ విత్ డ్రా చేసుకోవచ్చని స్పష్టం చేసింది. కేవైసీ పత్రాలు ఇవ్వని వారు నెలకు రూ. 5 వేలు మాత్రమే విత్ డ్రా చేసుకోగలరని తెలిపింది.