: ఏపీ పర్స్ కు భాగస్వామిగా 'ఫ్రీ చార్జ్'!


ఆంధ్రప్రదేశ్ లో నగదు రహిత లావాదేవీలను మరింతగా పెంచుతూ, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురానున్న 'ఏపీ పర్స్'కు చెల్లింపుల భాగస్వామిగా 'ఫ్రీ చార్జ్' డీల్ కుదుర్చుకోనుంది. వివిధ రకాల పేమెంట్ యాప్ లు, టూల్స్ ఉండే ఏపీ పర్స్ డిజిటల్ చెల్లింపులను సులభతరం చేస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చెల్లింపులను ప్రోత్సహిస్తుంది. ఇక ఏపీ పర్స్ తో భాగస్వామ్యం కానుండటం తమకెంతో ఆనందకరమని ఫ్రీచార్జ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోవింద్ రాజన్ వ్యాఖ్యానించారు. ఏపీ పర్స్ కు చంద్రబాబు ప్రభుత్వం మంచి ప్రచారం కల్పిస్తోందని అన్నారు. ఏపీ ప్రభుత్వం, ఫ్రీ చార్జ్ మధ్య త్వరలో డీల్ కుదరనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News