: అయ్యప్ప భక్తులతో వెళుతున్న బస్సు బోల్తా.. పదిమందికి గాయాలు.. ప్రకాశం జిల్లాలో ఘటన
అయ్యప్ప భక్తులతో వెళ్తున్న బస్సు బోల్తాపడిన ఘటనలో పదిమంది గాయాలపాలయ్యారు. ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. శబరిమల నుంచి ఏలూరు వెళ్తుండగా ఓ లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పదిమంది అయ్యప్ప భక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఒంగోలులోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక తెలంగాణలోని సూర్యాపేట వద్ద మరో ప్రమాదం చోటుచేసుకుంది. తాడ్వాయి వద్ద మూసీ వంతెనపై ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడింది. బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కోదాడ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.