: ఏడు నెలల తర్వాత నడుస్తున్న నిఖిల్‌రెడ్డి.. వాకర్ సాయంతో అడుగులో అడుగు
నిఖిల్‌రెడ్డి గుర్తున్నాడా?.. ఎత్తు పెరిగేందుకు గ్లోబల్ ఆస్పత్రిలో చేరి బెడ్‌కే పరిమితమైన ఆయన ఆపరేషన్ వ్యవహారం తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఇటీవల ప్రభుత్వం నిఖిల్‌కు ఆపరేషన్ చేసిన వైద్యుడిపై నిషేధం విధించింది. కాగా ఏడు నెలలుగా ఆస్పత్రి బెడ్‌కే పరిమితమైన నిఖిల్ రెడ్డి ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటున్నాడు. సరిగ్గా ఏడు నెలల 22 రోజుల తర్వాత తొలిసారి లేచి నిల్చున్నాడు. అంతేకాదు మంగళవారం వాకర్ సాయంతో ఇంటిలో కొన్ని అడుగులు వేశాడు. నొప్పిగా ఉన్నా కొన్ని అడుగులు వేయడం సంతోషంగా ఉందని నిఖిల్ తండ్రి గోవర్థన్‌రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. రోజూ ప్రయత్నించడం వల్ల పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.