: ఆర్థిక నగరంగా ముంబై స్థానాన్ని ఆక్రమించనున్న ఢిల్లీ


దేశ ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన ముంబై తన స్థానాన్ని త్వరలోనే ఢిల్లీకి అప్పగించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌ విడుదల చేసిన జాబితా ప్రకారం ఢిల్లీ కొత్త ఆర్థిక రాజధానిగా రూపాంతరం చెందిందని తెలుస్తోంది. 2015 డేటా ప్రకారం ప్రపంచంలోని అతి పెద్ద 50 ఆర్థిక నగరాల జాబితాలో ఢిల్లీ 30వ స్థానం సంపాదించగా, ముంబై 31వ స్థానంలో నిలిచింది. గతంలో ముంబై, నవీ ముంబై, థానే, వసై, వీరార్, భీవండి, పన్వేల్‌ ప్రాంతాలతో కూడిన ముంబై మెట్రోపాలిటన్‌ నగరం జీడీపీ 368 వందల కోట్ల డాలర్లు ఉండగా, తాజాగా దాని స్థానాన్ని గురుగ్రామ్, నోయిడా, ఘాజియాబాద్, ఫరీదాబాద్‌ లను కలుపుకున్న ఢిల్లీ– ఎన్సీఆర్‌ జీడీపీ 370 వందల కోట్ల డాలర్ల (రూ.25,164,00 కోట్లు)ని ఈ డేటా వెల్లడించింది. 2030 నాటికి ప్రపంచంలోని అతిపెద్ద నగరాల జాబితాలో ఢిల్లీ 11, ముంబై 14వ స్థానంలో ఉంటాయని ఈ జాబితా అభిప్రాయపడింది.

  • Loading...

More Telugu News