: దర్జాగా ఎమ్ఈఎస్ లో ప్రవేశించి... సైనికులను హత్య చేసి.. 16 మందిని బందీలుగా చేసుకున్న ఉగ్రవాదులు
సర్జికల్ స్ట్రయిక్స్ కు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన పాకిస్థాన్ ఆ దిశగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. జమ్మూకాశ్మీర్ లోని నగ్రోటాలోని ఆర్మీ క్వార్టర్స్ లో ఉన్న ఎమ్ఈఎస్ (మిలట్రీ ఇంజనీర్స్ సర్వీసెస్) భవనంలోకి సాయుధులైన ముగ్గురు ఉగ్రవాదులు సైనిక యూనిఫాంలో ప్రవేశించారు. అక్కడున్న ఏడుగుర్ని హత్య చేశారు. ఇందులో ఇద్దరు ఆర్మీ అధికారులు కూడా ఉన్నారు. అనంతరం అక్కడున్న 16 మందిని బందీలుగా చేసుకున్నారు. ఈ 16 మందిలో 12 మంది ఆర్మీ జవాన్లు కాగా, ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు చిన్నారులు కావడం విశేషం. దీంతో ఆ ప్రాంతాన్ని సైనికులు చుట్టుముట్టారు. పఠాన్ కోట్ ఉగ్రదాడి అనంతరం చోటుచేసుకున్న యురీ సెక్టార్ దాడి తీవ్రమైనది కాగా, ప్రస్తుతం చోటుచేసుకున్న దాడి మరింత తీవ్రమైనది కావడం విశేషం.