: ప్రధాని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై సీపీఐ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు


పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఈ రోజు వరంగల్ లో మరోమారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వంద బుల్లెట్లతో మోదీని కాల్చినా పాపం లేదని, ప్రజాకోర్టులో ఆయన శిక్షార్హుడని వ్యాఖ్యానించారు. హిట్లర్ లాంటి వాళ్లు కూడా తమ దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునే ప్రయత్నాలు చేశారని, మోదీ మాత్రం ఈ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయిన ఇద్దరు చంద్రులు మోదీ భజనలో కాలం గడుపుతున్నారని విమర్శించారు. ప్రధాన మంత్రి సెంటిమెంట్ తో, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు బ్లాక్ మెయిల్ తో, ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లు మోదీ భజనతో కాలం గడుపుతున్నారని నారాయణ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News