: హైదరాబాదులోని ప్రకాశ్ నగర్ లో దారుణం... భార్య గొంతు కోసి హత్య చేసిన భర్త


హైదరాబాదులోని బేగంపేట సమీపంలోని ప్రకాశ్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. ప్రకాశ్ నగర్ కు చెందిన ఈశ్వర్ అనే వ్యక్తి తన భార్య కనిపించడం లేదంటూ 40 రోజుల క్రితం బేగంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో గాలింపు చేపట్టిన పోలీసులు ఈశ్వర్ భార్య కవితను వెతికిపట్టుకుని, భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చి, హాయిగా కలిసి కాపురం చేసుకోండని చెప్పి ఇంటికి పంపారు. భార్య కవితను తీసుకుని ఆటోలో ఇంటికి వెళ్తున్న ఈశ్వర్ మార్గమధ్యంలో తన భార్యను ఆటోలోంచి బయటకు లాగి గొంతుకోసి హత్య చేసి, పరారయ్యాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఈశ్వర్ కోసం గాలింపు చేపట్టారు.

  • Loading...

More Telugu News