: పెద్ద నోట్ల రద్దు సాహసోపేతమైన చర్య: కపిల్ దేవ్ ప్రశంస
పెద్దనోట్ల రద్దుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైన చర్యగా మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ అభివర్ణించారు. లూధియానాలోని సత్పాల్ మిత్తల్ పాఠశాల వార్షికోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, దేశ భవిష్యత్తు కోసం మోదీ తీసుకున్న ఈ చర్య అభినందనీయమని అన్నారు. ప్రజలకు తాత్కాలిక ఇబ్బందులు ఎదురైనా భవిష్యత్తులో సత్ఫలితాలు వస్తాయని, చిన్నారులకు బంగారు భవిష్యత్తు లభిస్తుందని అన్నారు. రాజకీయపార్టీలతో తనకు ఎలాంటి సంబంధం లేకున్నప్పటికీ, దేశ ప్రయోజనాల కోసం తీసుకునే సరైన చర్యలను ప్రశంసించకుండా తాను ఉండలేనని అన్నారు.