: అవినీతిని, పరిపాలనలో లోపాలను ప్రజలు సహించరు: ప్రధాని మోదీ


అవినీతిని, పరిపాలనలో లోపాలను ప్రజలు సహించరని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మహారాష్ట్ర, గుజరాత్ లో జరిగిన స్థానిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ, బీజేపీపై నమ్మకం ఉంచిన గుజరాత్ ప్రజలకు సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీకి కట్టబెట్టిన ఈ గొప్ప విజయం, అభివృద్ధి రాజకీయాలపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తుందని ఆయన తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, రాష్ట్ర బీజేపీ నేత జీతూ వాఘానీని ఆయన అభినందించారు. పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధించిందని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News