: ప్రత్యర్థులు వాళ్ల మ్యానిఫెస్టోను మాపై రుద్దుతున్నారు: కేటీఆర్


ప్రత్యర్థులు వాళ్ల మ్యానిఫెస్టోను తమపై రుద్దుతున్నారని తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో తాము చేయని హామీలు, మ్యానిఫెస్టోలో లేని అంశాలను ప్రతిపక్షాలు తమపై రుద్దుతున్నాయని, పసలేని విమర్శలు చేస్తున్నాయని అన్నారు. ‘ఇంటికో జాబ్ ఇస్తామని మేము చెప్పలేదు. ‘జాబ్ రావాలంటే బాబు కావాలి’ ఈ డైలాగ్ చెప్పింది ఆ పార్టీ వాళ్లే. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నది వాళ్లు. వాళ్లకు చేతకాక వాళ్ల పార్టీ మ్యానిఫెస్టోను మాపై రుద్దుతున్నారు. అలవి కాని మాటలేవీ మేము చెప్పలేదు. చేయగలిగే హామీలను ఇచ్చాం. ఓట్ల కోసం ఇష్టం వచ్చినట్లు మేము మాట్లాడలేదు’ అని కేటీఆర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News