: ‘సిరీస్‌ను ఇంగ్లండ్‌ 0-4తో కోల్పోయే అవకాశం’.. టీమిండియాకు అభినందనలు తెలిపిన ప్రముఖులు


ఇంగ్లండ్ క్రికెట్ జ‌ట్టుతో ఈ రోజు మొహాలి వేదికగా జరిగిన టెస్టు మ్యాచులో ఘ‌న‌విజ‌యం సాధించి 2-0 ఆధిక్యంలో నిలిచిన టీమిండియాకు ప‌లువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా టీమిండియా ఆట‌గాళ్లు క‌న‌బ‌రుస్తోన్న ఆట‌తీరును వారు కొనియాడారు. టీమిండియా మాజీ ఆట‌గాళ్లు వీవీఎస్‌ లక్ష్మణ్, మహ్మద్‌ కైఫ్ తో పాటు క్రికెట్ విశ్లేష‌కుడు మోహన్‌దాస్‌ మేనన్, ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్ మైకేల్‌ వాన్త‌మ ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా స్పందిస్తూ టీమిండియాను ప్ర‌శంసించారు. టీమిండియా అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేసింద‌ని, పార్థీవ్‌ పటేల్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడ‌ని, ఇంగ్లండ్‌ ఈ సిరీస్‌ను 0-4 తో కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయని వారు త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేశారు.

  • Loading...

More Telugu News