: ప్రైవేట్ కాలేజీ లెక్చరర్ల ఖాతాల్లో లక్షల కొద్దీ డబ్బు.. 10 మంది అరెస్ట్
విజయవాడలోని గాంధీ మహిళా కళాశాల కరస్పాండెంట్, నల్లకుబేరుడు కాంతారావు తన డబ్బుని మార్చుకోవడానికి చేసిన నిర్వాకం బయటపడింది. కోట్ల రూపాయల నల్లధనం కాలేజీలో పనిచేస్తోన్న లెక్చరర్ల బ్యాంకు ఖాతాల్లో జమచేశాడు. తమ ఖాతాల్లో లక్షల కొద్దీ డబ్బు జమ అయిందంటూ బ్యాంకుల నుంచి మెసేజ్‌లు రావడంతో ఆ కళాశాల లెక్చరర్లు షాకయ్యారు. తమకు తెలియకుండానే డబ్బులు ఎలా వేశారంటూ కాంతారావుని నిలదీశారు. సమాచారం అందుకున్న పోలీసులు కరస్పాండెంట్ కాంతారావు, బ్యాంకు మేనేజర్ సహా ఇందుకు సహకరించిన మరో 8 మందిని అరెస్టు చేశారు. కాంతారావు తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ ద్వారా లావాదేవీలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ కేసులో బ్యాంకు అధికారుల పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. లెక్చరర్లకి వేతనాలు చెల్లించే క్రమంలో కరస్పాండెంట్ వద్ద వారి ఖాతాల వివరాలు ఉంటాయి.