: భారీ స్థాయిలో మద్యం సీసాలు, మద్యం తయారికి ఉపయోగించే పదార్థాలు స్వాధీనం
జార్ఖండ్ రాజధాని రాంచీలోని సుమ్‌కుమ్ ప్రాంతంలో ఈ రోజు అధికారులు భారీగా మద్యం, లిక్కర్ తయారీకి కావాల్సిన పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో అక్రమంగా మద్యం నిల్వలు ఉన్నాయని సమాచారం అందుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు పోలీసులతో కలిసి ఈ రోజు మధ్యాహ్నం దాడులు జరిపారు. ఈ దాడుల్లో 14,000 సీసాల మద్యం, 1,500 లీటర్ల మద్యం తయారికి ఉపయోగించే పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.