: బ్యాటింగ్ మీద బాగా కసరత్తు చేశాను...బేసిక్స్ కు కట్టుబడి ఆడాను: పార్థివ్ పటేల్


8 ఏళ్ల తరువాత పునఃప్రవేశించిన తనకు సహచరులు మంచి సపోర్ట్ ఇచ్చారని టీమిండియా వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్ లో మళ్లీ అడుగుపెట్టేందుకు 8 ఏళ్లు సుదీర్ఘ విరామం తీసుకోవడం కాస్త ఇబ్బందికరమైనప్పటికీ పునఃప్రవేశంలో రాణించడం ఆనందంగా ఉందని తెలిపాడు. జట్టు నుంచి ఉద్వాసనకు గురైన తరువాత బ్యాటింగ్ మీద బాగా కసరత్తు చేశానని తెలిపాడు. అందుకే డ్రైవ్ లు ఆడగలుగుతున్నానని చెప్పాడు. కట్ షాట్లపై కొద్దిగా సాధికారత సాధించానని పేర్కొన్నాడు. బేసిక్స్ కు కట్టుబడి బ్యాటింగ్ చేశానని, అందుకే ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా అర్ధ సెంచరీ సాధించానని పార్థివ్ తెలిపాడు. ఇలా రాణించడం ఏ ఆటగాడికైనా ఆనందమేనని, విన్నింగ్ షాట్ కొట్టడం మరపురాని అనుభూతి అని పార్థివ్ పటేల్ తెలిపాడు.

  • Loading...

More Telugu News