: తిరుగులేని కోహ్లీ కెప్టెన్సీ... సిరీస్ లో ఆధిక్యం...మూడో టెస్టు టీమిండియా వశం


కోహ్లీ కెప్టెన్సీకి తిరుగులేదని మరోసారి నిరూపణ అయింది. టెస్టు పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అపజయాలు లేకుండా కోహ్లీ కెరీర్ సాగిపోతోంది. కెప్టెన్సీ కెరీర్ తో పాటు కోహ్లీ కూడా అసాధారణ ఫాంతో పరుగుల యంత్రంగా పేరుతెచ్చుకున్నాడు. సగటున నాలుగు టెస్టులకు ఒకటి చొప్పున సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో మొహాలీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ పతనాన్ని శాసించిన టీమిండియా మూడో టెస్టులో సాధికారిక విజయాన్ని సొంతం చేసుకుంది. 78/4 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగోరోజు రెండో ఇన్నింగ్స్‌ ను కొన‌సాగించిన ఇంగ్లండ్ టీమ్ 236 ప‌రుగుల‌కే ఆలౌట‌యింది. మొద‌టి ఇన్నింగ్స్‌ లోనూ ఇంగ్లండ్ 283 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌డంతో టీమిండియా ముందు 103 ప‌రుగుల ల‌క్ష్యం ఉంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే వోక్స్ షాకిచ్చాడు. దీంతో మురళీ విజయ్ (0) కేవలం ఏడు పరుగులకే మొదటి వికెట్ గా పెవిలియన్ చేరాడు. అనంతరం పార్థివ్ కు జత కలిసిన పుజారా (25) నిలదొక్కుకున్నాడు. అయితే రషీద్ బౌలింగ్ లో రూట్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఇన్నింగ్స్ లో దూకుడుగా ఆడిన పార్థివ్ పటేల్ (67) కోహ్లీ (6)తో కలిసి విజయతీరాలకు నడిపించాడు. దీంతో టీమిండియా 8 వికెట్ల తేడాతో మూడో టెస్టును గెలుచుకుంది. కాగా, టీమిండియా మొద‌టి ఇన్నింగ్స్‌లో 417 ప‌రుగులు చేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఐదు టెస్టుల సిరీస్ లో రెండు టెస్టు విజయాలతో భార‌త జట్టు ఆధిక్యం సాధించింది. ఇంకా రెండు టెస్టులు మిగిలి ఉన్నాయి.

  • Loading...

More Telugu News