: పార్థివ్ దూకుడుతో లక్ష్యం దిశగా టీమిండియా


టీమిండియా వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ దూకుడుగా ఆడుతున్నాడు. దీంతో 103 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదిస్తోంది. మొహాలీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ జట్టు 236 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ మురళీ విజయ్ (1) వికెట్ కోల్పోయింది. దీంతో ఛటేశ్వర్ పుజారా (25)తో కలిసి పార్థివ్ పటేల్ (57) భారత జట్టును విజయం దిశగా నడిపిస్తున్నాడు. వన్డే తరహా బ్యాటింగ్ తో దూకుడుగా ఆడుతూ ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో అర్ధ సెంచరీ సాధించి సత్తాచాటాడు. దీంతో తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా 17 ఓవర్లలో 88 పరుగులు చేసింది. విజయానికి మరో 15 పరుగులు కావాల్సి ఉంది.

  • Loading...

More Telugu News