: సోనియాగాంధీకి అస్వస్థత
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈ రోజు మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆమెను న్యూఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రికి తరలించారు. ఆమె వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆసుపత్రిలో ఆమె చికిత్స తీసుకుంటున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. సోనియాగాంధీ రెండు రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండాలని సదరు ఆసుపత్రి వైద్యులు తెలిపారు.