: వెలగపూడి సచివాలయంలో తొలిసారి భేటీ కానున్న ఏపీ మంత్రివర్గం

ఇన్నాళ్లూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచే పాలన కొనసాగిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ఇకపై ఆయన అమరావతిలో నూతనంగా నిర్మించిన వెలగపూడి సచివాలయం నుంచే పరిపాలన కొనసాగించనున్నారు. ఈ క్రమంలో తొలిసారి అక్కడ రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయం మొదటి భవనంలోని సమావేశ మందిరంలో ఈ భేటీ జరుగుతుంది. వీలైనంత త్వరగా సచివాలయం నుంచే పాలన కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు యోచిస్తున్నారు.