: ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీపీఐ నారాయణపై కేసు నమోదు
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణపై ఏపీలోని ఒక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ, స్థానిక బీజేపీ నేతలు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, పెద్దనోట్ల రద్దును నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పలు ర్యాలీలు జరిగాయి. ఈ ర్యాలీలలో పాల్గొన్న నారాయణ ప్రధానిపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ‘ఏ కోర్టుకు వెళ్లినా మోదీకి శిక్ష తప్పదని.. ప్రజాకోర్టుకు కనుక వస్తే మోదీకి ఉరిశిక్ష తప్పదు’ అని మోదీపై ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు.