: 236 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్.. భారత్ లక్ష్యం 103 పరుగులు మాత్రమే!
ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ భారత్ పర్యటనలో భాగంగా మొహాలీలో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచులో నాలుగోరోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లండ్ టీమ్ 236 పరుగులకే ఆలౌటయింది. మొదటి ఇన్నింగ్స్‌లోనూ ఇంగ్లండ్ 283 పరుగులు మాత్రమే చేయడంతో టీమిండియా ముందు 103 పరుగుల లక్ష్యం ఉంది. టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 417 పరుగులు చేసిన విషయం తెలిసిందే. భారత బౌలర్లలో షమీ, జడేజా, జయంత్‌లకు తలో రెండు వికెట్లు లభించగా, అశ్విన్ మూడు వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో తొలి ఇన్నింగ్స్‌లో కుక్ 27, హమీద్ 9, రూట్ 15, అలీ 16, బయిర్ స్టో 89, స్టోక్స్ 29, బట్లెర్ 43, వోకర్స్ 25, రషీద్4, బాట్టీ 1, అండర్సన్ (నాటౌట్) 13 పరుగులు తీశారు. ఎక్స్ ట్రా ల రూపంలో 12 పరుగులు లభించాయి. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో కుక్ 12, హమీద్ 59, రూట్ 78, అలీ 5, బయిర్ స్టో 15, స్టోక్స్ 5, బట్లెర్ 18, వోకర్స్ 30, రహీద్ 0, బాట్టీ 1, అండర్సన్ (నాటౌట్) 5 పరుగులు తీశారు. ఇంగ్లండ్ కు ఎక్స్ ట్రా ల రూపంలో 9 పరుగులు లభించాయి.