: నిమ్స్ లో నోట్లు పంపిణీ చేసిన అభిమానులకు పవన్ కల్యాణ్ అభినందన


వైద్యం నిమిత్తం హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి వచ్చి, రూ. 1000, రూ. 500 నోట్ల మార్పిడి విషయంలో అనేక ఇబ్బందులు పడుతున్న రోగులు, వారి సహాయకులకు జనసేన అభిమానులు అండగా నిలిచారు. ఆదివారంనాడు వారి వద్ద ఉన్న పెద్ద నోట్లను తీసుకుని, చిన్న నోట్లను ఇచ్చారు. 'సమస్యలపై ప్రశ్నిద్దాం, నిలదీద్దాం, సాయం చేద్దాం' అన్న తమ అధినేత పవన్ కల్యాణ్ స్ఫూర్తితోనే తాము ఈ పని చేశామని వారు తెలిపారు. దీనిపై పవన్ కల్యాణ్ స్పందించారు. నిమ్స్ లో దిక్కుతోచని స్థితిలో ఉన్నవారికి సహాయం చేసిన జనసేన అభిమానులకు అభినందనలు అని ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News