: చంద్రబాబు సారథ్యంలో ఆరు రాష్ట్రాల సీఎంలతో పెద్దనోట్ల రద్దుపై కమిటీ ఏర్పాటు
పెద్దనోట్ల రద్దు అనంతరం దేశ వ్యాప్తంగా జరిగిన పరిణామాలపై అధ్యయనం చేసి నివేదిక తెప్పించుకునే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న ఆరు రాష్ట్రాల సీఎంల కమిటీ ఏర్పాటయింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి సారథ్యం వహిస్తారు. ఈ కమిటీలో సభ్యులుగా చంద్రబాబుతో పాటు మధ్యప్రదేశ్, ఒడిశా, పుదుచ్చేరి, త్రిపుర, బీహార్ సీఎంలను నియమించారు. నగదు రహిత లావాదేవీలు, కార్డుల వినియోగం అంశాలను ప్రోత్సహించడంపై కమిటీ సమగ్రంగా పరిశీలన జరిపి కేంద్ర ఆర్థిక శాఖకు నివేదిక ఇవ్వనుంది. వచ్చేనెల 2వ తేదీన ఈ కమిటీ సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.