: 30 ఏళ్ల తర్వాత నటించనున్న అలనాటి అందాల తార కాంచన


అలనాటి అందాల నటి కాంచన దాదాపు 30 సంవత్సరాల తర్వాత మళ్లీ నటించబోతున్నారు. తెలుగు సినిమా 'అర్జున్ రెడ్డి'లో ఆమె నటిస్తున్నట్టు ఆ సినిమా దర్శకుడు సందీప్ వంగా తెలిపాడు. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తున్నాడు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ, తమ సినిమాలో నటించేందుకు కాంచన తొలుత ఒప్పుకోలేదని... ఎంతో కష్టపడి ఆమెను ఒప్పించామని తెలిపాడు. సదీర్ఘ చర్చల అనంతరం నటించేందుకు ఆమె ఓకే చెప్పారని అన్నాడు. ఈ సినిమాలో విజయ్ కు బామ్మగా కాంచన నటించనున్నారని... ఆమెది కీలక పాత్ర అని చెప్పాడు. రేపట్నుంచి ఆమె షూటింగ్ లో పాల్గొంటారని తెలిపాడు. 77 ఏళ్ల కాంచన చివరిసారిగా 'శ్రీదత్త దర్శనం' అనే తెలుగు సినిమాలో నటించారు. 1985లో ఈ సినిమా విడుదలైంది. దక్షిణాదిన అన్ని భాషల్లో ఆమె నటించారు.

  • Loading...

More Telugu News