: మాలా? ఎస్టీయా?: కులంపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఎంపీ గీతకు హైకోర్టు నోటీసులు
ఏ కులానికి చెందిన వారన్న విషయమై పూర్తి ఆధారాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు తెలుగు రాష్ట్రాల హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆమె ఎస్టీ (షెడ్యూల్డ్ తెగలు) వర్గానికి చెందిన మహిళ కాదంటూ కోర్టులో వ్యాజ్యం దాఖలు కాగా, కోర్టు దాన్ని విచారించింది. ఎస్సీ (షెడ్యూల్డ్ కులాలు) వర్గంలోని మాల కులానికి చెందిన ఆమె, ఎస్టీగా పోటీ చేశారని పిటీషనుదారు వాదించారు. దీనిపై స్పందించిన హైకోర్టు, గీతకు సమాధానం చెబుతూ అఫిడవిట్ సమర్పించాలని ఆదేశిస్తూ, కేసు విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.