: ఫుట్ బాల్ ఆటగాళ్ల విమానం క్రాష్... 75 మంది దుర్మరణం... ప్రాణాలు దక్కించుకున్న ఆరుగురు

బ్రెజిల్ ఫుట్ బాల్ క్లబ్ చాపెకోయిన్సీ రియల్ ఆటగాళ్లు, జట్టు అధికారులు సహా మొత్తం 72 మంది ఫ్రయాణికులు, 9 మంది సిబ్బందితో కలసి బొలీవియా నుంచి మెడెల్లిన్ ఎయిర్ పోర్టుకు వస్తూ, సెర్రో గ్రోడో నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో క్రాష్ ల్యాండింగ్ అయిన విమానంలో 75 మంది మరణించారని అధికారులు తెలిపారు. మరో ఆరుగురు ప్రాణాలు దక్కించుకుని మృత్యుంజయులు అయ్యారని ఓ అధికారి తెలిపారు. సీపీ 2933 లైసెన్స్ నంబర్ గల చార్టెడ్ విమానం ఆటగాళ్లను తరలిస్తోందని, ఇంధనం అయిపోయిన కారణంగా ప్రమాదం జరిగి వుంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని తెలిపారు. గాయపడిన వారికి చికిత్స చేసేందుకు ఆసుపత్రులు సిద్ధంగా ఉన్నాయని ఘటనా స్థలికి సమీపంలోని నగరం లా సెజా మేయర్ ఎల్కిన్ ఓస్పినా వెల్లడించారు. విమానం కూలిన ప్రాంతంలో వాతావరణం అనుకూలంగా లేని కారణంగా సహాయక చర్యలు ఆలస్యమవుతున్నట్టు మెడెల్లిన్ ఎయిర్ పోర్టు తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.

More Telugu News