: ఎక్స్‌ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపు కాల్.. రైలును ఖాళీ చేయించిన అధికారులు
జమ్మూ, పాట్నా ఎక్స్‌ప్రెస్‌కు ఈ రోజు ఉదయం ఓ గుర్తు తెలియని వ్యక్తి బాంబు బెదిరింపు కాల్ చేయడంతో తీవ్ర అలజడి చెలరేగింది. రైలులో బాంబు ఉందని చెప్పడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే రైలును ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టారు. అన్ని బోగీల్లో క్షుణ్ణంగా తనఖీలు నిర్వహించి చివరికి బాంబు లేదని తేల్చిచెప్పారు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఘటనా స్థలికి పోలీసులు కూడా చేరుకున్నారు. బెదిరింపు కాల్‌పై అధికారులు ఆరా తీస్తున్నారు.