: ముందు చర్చను ప్రారంభించండి, మోదీ హాజరవుతారు: రాజ్యసభలో వెంకయ్య
రాజ్యసభ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అంతకు ముందు సభలో మాట్లాడిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పెద్దనోట్ల రద్దుపై చర్చకు సిద్ధమని ప్రకటించారు. తాము చర్చకు సిద్ధమని చెప్పినప్పటికీ విపక్షనేతలు సభలో ఆందోళన చేయడం భావ్యంకాదని ఆయన పేర్కొన్నారు. రాజ్యసభలో పెద్దనోట్ల రద్దుపై ముందు చర్చను ప్రారంభించాలని, ప్రధాని మోదీ హాజరవుతారని ఆయన చెప్పారు. మరోవైపు బీఎస్పీ ఎంపీ మాయావతి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ సభకు రావాల్సిందేనని, తాము చెప్పే విషయాలను మోదీ వినాల్సిందేనని డిమాండ్ చేశారు.