: అత్యంత దారుణమైన ఘోరం... ఇంధనం లేక క్రాష్ అయిన ఫుట్ బాల్ ఆటగాళ్ల విమానం... ప్రమాదానికి ముందు సెల్ఫీ ఇది!


బ్రెజిల్ ప్రొఫెషనల్ ఫుట్ బాల్ ఆటగాళ్లు సహా 75 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందితో ప్రయాణిస్తున్న విమానం ఎవరూ ఊహించలేనటువంటి దారుణమైన పరిస్థితుల్లో కూలింది. విమానంలో ఇంధనం లేక యూఎస్ లోని సెర్రో గోర్డో ప్రాంతంలో రాత్రి 10:15 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 9:45 గంటలకు) క్రాష్ అయింది. కోపా సుడామిరికానా ఫైనల్స్ ఆడేందుకు చాపకోయిన్సీ జట్టు ఈ విమానంలో వెళుతోంది. కొలంబియాలో రెండో అతిపెద్ద విమానాశ్రయమైన జోస్ మారియా కోర్డోవా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఇది ల్యాండ్ కావాల్సి వుంది. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సౌత్ అమెరికన్ ఫుట్ బాల్ కాన్ఫెడరేషన్ 'కాన్మీబోల్' టోర్నీని నిలిపివేస్తున్నట్టు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ప్రమాదంలో విమానం పరిస్థితి, ఎవరైనా బతికున్నారా? ఎక్కడ క్రాష్ ల్యాండయిందన్న విషయం తెలియాల్సివుంది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఫుట్ బాల్ జట్టులోని ఓ ఆటగాడు తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకున్న ఫోటో ఇది.

  • Loading...

More Telugu News