: కొలంబియాలో కూలిన విమానం... ఫుట్ బాల్ టీం దుర్మరణం?


ప్రపంచ ఫుట్ బాల్ చరిత్రలో అత్యంత దారుణమైన ప్రమాదం జరిగింది. సౌత్ అమెరికన్ ఫుట్ బాల్ టీమును తీసుకువెళుతున్న విమానం కొలంబియాలో కుప్పకూలింది. బ్రెజిల్ లో భాగమైన చాపెకోయిన్సీ కౌంటీ జట్టును మెడలిన్ ఎయిర్ పోర్టుకు తీసుకువెళుతున్న విమానం రాడార్ నుంచి అదృశ్యమైందని తొలుత, ఆపై కుప్పకూలినట్టు వార్తలు వచ్చాయి. ఈ విమానంలో మొత్తం 80 మంది ఉన్నారని, వారిలో అత్యధికులు ఫుట్ బాల్ టీం, జట్టు అధికారులేనని 'రష్యా టుడే' వెల్లడించింది. సౌత్ అమెరికన్ ఫుట్ బాల్ చాంపియన్ షిప్ ఫైనల్లో ఆడేందుకు చాపెకోయిన్సే ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానం అదృశ్యమైన రాడార్ వీడియో దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విడుదలయ్యాయి. ఈ ప్రమాదంలో ఎంతమంది మరణించారు? అన్న వివరాలు తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News