: రాజకీయంగా నన్ను హత్య చేస్తే... మీకు ఏం వస్తుంది?: నితీష్ కుమార్


ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నిన్న మాత్రం చాలా సీరియస్ అయ్యారు. రాజకీయంగా నన్ను హత్య చేయాలనుకుంటున్నారా... దీనివల్ల మీకు ఏం వస్తుందంటూ జర్నలిస్టులను ప్రశ్నించారు. వివరాల్లోకి వెళ్తే, పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని నితీష్ కుమార్ సమర్థిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు, నితీష్ కుమార్ ను కూడా బీజేపీ నేతలు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అయితే నితీష్ ను పొగుడుతూ రెండుమూడు సార్లు ట్వీట్లు కూడా చేశారు. ఈ నేపథ్యంలో, ప్రధాని మోదీ ఈ మధ్య మీకు బాగా దగ్గరవుతున్నట్టున్నారు... మీరు కూడా ఎన్టీఏకు బహిరంగంగానే మద్దతు తెలుపుతున్నట్టున్నారంటూ నితీష్ తో జర్నలిస్టులు అన్నారు. దీంతో, పనిగట్టుకుని తనను రాజకీయంగా హత్యచేసే ప్రయత్నం జరుగుతోందని... దీని వల్ల మీకు ఏమొస్తుందని... ఇది ఎల్లో జర్నలిజం అంటూ మండిపడ్డారు.

  • Loading...

More Telugu News