: పుష్పగిరి ఆలయం నేలమాళిగలో ముగ్గురు సిద్ధుల జీవ సమాధి... శతాబ్దాల తరువాత వెలుగులోకి!
తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఉన్న పురాతన ఆలయంలో విశాలమైన నేలమాళిగ బయటపడగా, విషయం తెలుసుకుని లోపలికి వెళ్లిన వారికి జీవ సమాధి అయిన ముగ్గురు సిద్ధుల ఆస్థి పంజరాలు కనిపించాయి. కడలూరు సమీపంలోని పుష్పగిరి మలైయాండవర్ దేవాలయానికి మరమ్మతులు జరుగుతున్న వేళ, భూగర్భ మార్గం వెలుగులోకి వచ్చింది. భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు లోపలకి వెళ్లి చూడటంతో తపస్సు చేస్తున్న భంగిమలో ఉన్న మూడు ఆస్థి పంజరాలు దర్శనమిచ్చాయి. ఈ నేలమాళిగ కనీసం 400 నుంచి 500 సంవత్సరాలకు పూర్వం నిర్మించి వుండవచ్చని, ఈ ప్రాంతంలో ఇప్పటికీ కొందరు సిద్ధులు తప్పస్సు చేస్తూ వుంటారు. నేలమాళిగలోకి భక్తుల ప్రవేశాన్ని నిషేధించిన పురావస్తు అధికారులు, ఈ నేలమాళిగ గురించిన మరిన్ని వివరాల కోసం గత శాసనాలు, తాళపత్రాలను పరిశీలిస్తున్నారు.