: రూ. 2 వేల నోటు మోదీ ప్లాన్... రద్దు కావచ్చు: కేసీఆర్
భవిష్యత్తులో రెండు వేల రూపాయల నోటు ఉంటుందని కచ్చితంగా చెప్పలేమని, ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహంలో 2 వేల నోట్లు ఓ భాగం కావచ్చని తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఈ నోటు రద్దు కావచ్చని అంచనా వేశారు. దేశంలోని ప్రజల్లో కేవలం ఒక్క శాతం మంది మాత్రమే ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని, భవిష్యత్తులో ఇన్ కంటాక్స్ ఉండకపోవచ్చని కేసీఆర్ జోస్యం చెప్పారు. జీఎస్టీతో పాటు బ్యాంక్ ట్రాన్సాక్షన్ పన్నును విధిస్తే, ఇప్పుడు వస్తున్న ఆదాయానికన్నా ఐదు నుంచి ఆరు రెట్లు అధిక ఆదాయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తుందని కేసీఆర్ వెల్లడించారు. నోట్ల రద్దు తరువాత రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మేరకు ఆదాయం తగ్గుతుందన్నది వచ్చే నెలలో తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు.