: అనంతపురంలో రూ.18 లక్షల విలువైన కొత్త నోట్లు సీజ్.. ఐటీ అధికారులకు అప్పగింత
పెద్ద నోట్ల రద్దుతో బ్లాక్ మనీ బయటకు వస్తుందనుకుంటే అందుకు విరుద్ధంగా జరుగుతోంది. నల్ల నోట్లు ఏమో కానీ కొత్త నోట్ల కట్టలు మాత్రం భారీగా బయటకు వస్తున్నాయి. ఆదివారం రాత్రి అనంతపురంలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు తళతళ మెరుస్తున్న కొత్త రూ.2వేల నోట్ల కట్టలు కనిపించాయి. కారులో వెళ్తున్న ఓ వ్యక్తి బ్యాగును తనిఖీ చేయగా అందులో రూ.18 లక్షల విలువైన కొత్త రూ.2వేల నోట్లు కనిపించాయి. నోట్లు తరలిస్తున్న వ్యక్తిని ధర్మవరానికి చెందిన బంగారం వ్యాపారి రవూఫ్‌గా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొమ్మును పోలీసులు ఆదాయపు పన్ను శాఖకు అప్పగించారు.