: రాజు తలుచుకుంటే..


ఆయనో ఎమ్మెల్యే.. పేరు తౌసిఫ్ ఆలమ్. వయసు 32. ఈ బీహార్ శాసనసభ్యుడు తన మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. ఇంతవరకు అభ్యంతరపెట్టాల్సింది గానీ, ఆక్షేపించాల్సింది గానీ ఏమీలేదు. అయితే, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు.. ఈ ఎమ్మెల్యే మహాశయుడు వివాహ వేదిక నుంచి పెళ్ళి కూతురిని తన నివాసానికి తీసుకెళ్ళేందుకు ఏకంగా ఓ హెలికాప్టర్ ను వినియోగించడం పలువురిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. మరీ ఇంత ఆడంబరమా? అంటూ ప్రజానీకం విస్మయం వ్యక్తి చేసింది.

కిషన్ గంజ్ లో జరిగిన ఈ ఖరీదైన వివాహానికి 50, 000 మంది హాజరయ్యారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఫంక్షన్ల సందర్భంగా దుబారా ఖర్చులు వద్దంటూ, ఓవైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియా తన పార్టీ ప్రజా ప్రతినిధులకు స్పష్టంగా హితబోధ చేస్తున్నా.. ఆలమ్ వంటి యువ నేతలు ఆ విజ్ఞప్తులు ఏమీ పట్టించుకున్నట్టు కనిపించడంలేదు.

వివాహ వేదిక వద్దనుంచి తన ఇంటి వరకు హెలికాప్టర్ ప్రయాణానికి ఆలమ్ చెల్లించిన మొత్తం రూ. 14.7 లక్షలట. పైగా, ఈయనగారి వివాహం ఓవైపు జరుగుతుంటే, మరోవైపు అనుచరగణం గాల్లోకి కాల్పులు జరిపి తమ సంతోషాన్ని ఘనంగా చాటుకున్నారు. అయితే, కాల్పుల వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కిషన్ గంజ్ పోలీసు అధికారులు విచారణకు ఆదేశించారు.

  • Loading...

More Telugu News