: కోహ్లీ కోరడం... జడేజా ఆచరించడం సాధారణమైపోయింది


టీమిండియా ఆటగాళ్లలో ధోనీ, రైనా, జడేజా మంచి మిత్రులన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ధోనీ, రైనా టెస్టు జట్టులో లేరు. దీంతో జడేజా కొత్త స్నేహితుడ్ని చూసుకున్నట్టు కనిపిస్తోంది. రవీంద్ర జడేజా రాణించిన ప్రతిసారీ కోహ్లీ పెవిలియన్ నుంచి ఉత్సాహపరుస్తుంటాడు. ప్రధానంగా జడేజా అర్ధసెంచరీ చేసిన తరువాత బ్యాటును కత్తిలా తిప్పమని కోరుతుంటాడు. అర్ధసెంచరీ చేసిన తరువాత పెవిలియన్ వైపు చూసి అభివాదం చేయడం, అప్పుడు కోహ్లీ కోరినట్టు జడేజా బ్యాటును కత్తిలా తిప్పడం ఈ మధ్య జరుగుతోంది. రాజ్ పుత్ సామాజిక వర్గానికి చెందిన రవీంద్ర జడేజాకు, కత్తియుద్ధం, గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టం అన్న సంగతి తెలిసిందే. జడేజా దగ్గర మేలుజాతి గుర్రాలు, కత్తులు సేకరించి ఉంచుకునే అలవాటు కూడా ఉంది. తాజాగా మూడో వన్డే మొదటి ఇన్నింగ్స్ లో జడేజా అర్ధ సెంచరీ చేశాడు. ఈ సందర్భంగా పెవిలియన్ వైపు చూడగా, బ్యాటుతో కత్తియుద్ధానికి ముందు చేసిన అభివాదం చేయమంటూ కోహ్లీ కోరాడు. దీంతో జడేజా బ్యాటును కత్తిలా తిప్పి స్టేడియంలోని అభిమానులను అలరించాడు.

  • Loading...

More Telugu News